హరీష్‎రావు త్వరగా కోలుకోవాలని భోగ్ బండార్..!

దిశ, నారాయణఖేడ్: తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని సంత్ సేవాలాల్ మహారాజ్ భవాని మందిరంలో ప్రత్యేక పూజలు, భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి తన్నీరు హరీష్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ రావు త్వరగా కోలుకోవాలని.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‎లోని ఎంబీఆర్ఆర్ కాలనీలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ లక్ష్మీభాయి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో హారతి, గిరిజన సంప్రదాయం ప్రకారం భోగ్ బండార్ కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement