జర్నలిస్టుల చికిత్సకు ప్రత్యేక ఆసుపత్రులు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత విపత్కర కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి ప్రత్యేక ఆసుపత్రులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటన వెల్లడించింది. ఇందుకు నోడల్ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

Advertisement