‘వాళ్లు తిరగబడితే ఎవరు కంట్రోల్ చేస్తారు’

by srinivas |
‘వాళ్లు తిరగబడితే ఎవరు కంట్రోల్ చేస్తారు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. నాడు కరోనా మహమ్మారి విస్తరిస్తోందంటూ వాయిదా వేసింది ఎస్ఈసీ కాదా? అని మండిపడ్డారు. ప్రజలు తిరగబడితే ఎవరు కంట్రోల్ చేస్తారని అన్నారు. ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించలేమన్నా.. ఎలా ఎన్నికలు పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తుల రాజకీయ లబ్దికోసం ఎన్నికలు పెట్టవద్దు అని సూచించారు. ఎన్నికలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సుప్రీం అని స్పీకర్ గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed