మా దగ్గరకు రాకండి

by srinivas |   ( Updated:2020-07-09 08:08:42.0  )
మా దగ్గరకు రాకండి
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జడలు విప్పుతోంది. ఏ మూల చూసినా కరోనా పాజిటివ్ కేసులు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రమంతటా ఆందోళన నెలకొంది. పరీక్షల్లో నెంబర్ వన్‌గా నిలబడినప్పటికీ కేసులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఫెయిలైందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రకటన విడదల చేశారు.

నేటి నుంచి క్యాంపు కార్యాలయాలు మూసేస్తున్నామని ప్రకటించారు. 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలు మూసే ఉంటాయని, తమను కలిసేందుకు ఎవరూ రావద్దని ప్రకటించారు. అమరావతితో పాటు సొంత నియోజకవర్గంలో కూడా కార్యాలయాలు మూసే ఉంటాయని తెలిపారు. కాగా, కృష్నా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటి వరకు రెండేసి వేలకుపైగా కేసులు నమోదైతే, శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఒక్కరోజే 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed