- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాన్సువాడలో రూ.500కోట్లతో 5వేల ఇళ్ల నిర్మాణం
దిశ, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల్లో రూ. 500 కోట్లతో 5వేల మేర రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను అన్ని వసతులతో చేపడుతున్నట్టు రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రాంగంగానగర్ గ్రామంలో రూ.2.51 కోట్లతో కొత్తగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళను, కొల్లూరు గ్రామంలో రూ. 7.50 లక్షలతో నిర్మించిన SC కమ్యూనిటీ హాల్‌ను స్పీకర్‌తో కలిసి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల్లో రూ.500 కోట్లతో చేపట్టిన 5వేల ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు.సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడలో మరో 10వేల ఇళ్ళు నిర్మించి ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తానన్నారు. పేదవారి కోసం నిర్మించిన ఇళ్లు వారికి మాత్రమే అందజేస్తామని, దయచేసి ఎవరూ అడ్డదారిన వాటిని పొందేందుకు ప్రయత్నించి మధ్యవర్తుల చేతులో మోసపోవద్దన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..డబుల్ బెడ్రూం ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకుంటున్నాయన్నారు. దసరా నాటికి లక్ష ఇళ్లు పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారన్నారు. రెండు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయని, బాన్సువాడలోని కోటగిరి మండలంలో లబ్ధిదారులైన పేదలకు 40 గృహాలు అందివ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాంగంగా నగర్‌కు ఇకమీద పీఎస్సార్‌గా నామకరణం..
రాంగంగానగర్ గ్రామం పేరును పీఎస్సార్ గ్రామంగా నామకరణం చేస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రతిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామ పాలకవర్గం అందజేసింది.