‘అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శం కావాలి’

by Shyam |
‘అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శం కావాలి’
X

దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శంగా నిలవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈనెల 6 నుంచి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా జరుగుతున్నశాసన సభ సమావేశాలను ప్రజలు గమనిస్తుంటారని పేర్కొన్నారు. సభ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణ పోలీసుశాఖ సమర్ధవంతమైన పనితీరుతో గత సమావేశాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయాని, ఈసారి కూడా అలానే జరగేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇతర రాష్ట్రాలలో చట్ట సభలు జరుగుతున్న సమయంలో జరిగే అవాంఛనీయ ఘటనలు మన దగ్గర లేకుండా తగు జాగ్రతలు తీసుకోవలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, శాసనమండలి చీఫ్ విప్ బోడేకంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి వి.నరసింహా చార్యులు, డిజీపి మహేందర్ రెడ్డి, డీజీ తేజ్‌దీప్ కౌర్, కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పాల్గొన్నారు.

tags : assembly meeting, speaker srinivas reddy , dgp , dg, ministers

Advertisement

Next Story

Most Viewed