- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఏడాది నుంచి అంతరిక్ష యాత్ర
దిశ, వెబ్‌డెస్క్:
వచ్చే ఏడాది నుంచే అంతరిక్ష యాత్ర అవకాశాన్ని స్పేస్ ఎక్స్ కల్పించబోతోంది. ఈ మేరకు హ్యూస్టన్‌కి చెందిన ప్రైవేటు కంపెనీ ఏక్సియం వారు, స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2021 రెండో అర్ధభాగంలో ఈ అంతరిక్ష యాత్రను మొదలుపెట్టనున్నారు. స్పేస్ ఎక్స్ వారి క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా ఈ యాత్రను సుగమం చేయనున్నారు. ఇందులో ముగ్గురు టూరిస్టులతో పాటు ఒక ఏక్సియం స్టాఫ్ మెంబర్‌ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు. ఈ స్టాఫ్ మెంబర్ అక్కడ వ్యోమగాముల పనులకు టూరిస్టులు ఇబ్బందులు కలిగించకుండా చూసుకుంటాడు.
పది రోజుల పాటు సాగనున్న ఈ ఏక్సియం మిషన్‌లో రెండు రోజులు రాను పోను ప్రయాణానికి సరిపోగా మిగతా ఎనిమిది రోజులు యాత్రికులు ఐఎస్ఎస్‌లో గడపనున్నారు. అయితే ఈ యాత్ర కోసం ప్రయాణ ఖర్చు ఎంత అనే విషయం అధికారికంగా ఇంకా తెలియరాలేదు. ముందుగా అమెరికా భూభాగం నుంచి నాసా వ్యోమగాములను క్యాప్సుల్ ద్వారా అంతరిక్షానికి పంపే పనులను స్పేస్ ఎక్స్ పూర్తి చేయనుంది. ఈ ప్రయత్నాన్ని ఏప్రిల్, జూన్‌లోగా పూర్తి చేసి, అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని మొదలుపెట్టనుంది. ఇప్పటికే స్పేస్ అడ్వెంచర్స్ అనే కంపెనీతో 2021 ఫిబ్రవరిలో టూరిస్టులకు ఉచిత భూకక్ష్య గమనం చేయించనున్నట్లు స్పేస్ ఎక్స్ ఒప్పందం కూడా చేసుకుంది.
Tags: SpaceX, Axiom, Space Tourism, ISS, International Space Station, NASA