అన్‌లాక్ 4.0పై మాయావతి కామెంట్స్..

by  |
అన్‌లాక్ 4.0పై మాయావతి కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ విడుదల చేసిన అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ పాలసీపై బహుజన సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి వెలువడిన గైడ్‌లైన్స్ ఏకీకృతంగా, చాలా బాగుందని మాయావతి ప్రశంసించారు. ఇది ఏ రాజకీయ పార్టీకీ, వ్యక్తులకూ అతీతంగా, సర్వజన సమ్మతంగా ఉందన్నారు.

ఈ పాలసీ ప్రకారం మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7 నుంచి నడపాలని అనుకుంటున్నారని, అలాగే రాజకీయ, సామాజిక, మతపరమైన సభలు, సమావేశాలను సెప్టెంబరు 21 నుంచి అనుమతించాలని హోంశాఖ తీసుకున్న నిర్ణయం అంగీకారంగా ఉందన్నారు. అలాగే స్కూళ్ళు, కాలేజీలను సెప్టెంబరు 30 వరకు మూసి ఉంచాలని, తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు కొన్ని సడలింపులతో తరగతులు నిర్వహించాలని చేసిన ప్రతిపాదన సహేతుకంగా ఉందని కితాబిచ్చారు. కేవలం కొన్నిపార్టీల స్వార్థపర ప్రయోజనాలను ఈ పాలసీలో పక్కనపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed