- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజాభిమానం మరింత స్ఫూర్తినిస్తుంది : ఎస్పీ
దిశ, మహబూబ్‌నగర్: సమాజ రక్షణకు విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం, అందిస్తున్న సహకారం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్నదని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కనిపించని కరోనా వైరస్ బారినుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి తమ బాగోగుల పట్ల అంతులేని శ్రద్ధ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బంగారు బాలప్ప జూవెల్లర్స్ ఆధ్వర్యంలో పోలీసులకు అందించిన మాస్కులు, సానిటైజర్ బాటిళ్లను ఎస్పీ స్వీకరించారు. అదేవిధంగా జిల్లాలోని పోలీసు సిబ్బందికి ఈ వస్తువులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: mahabubnagar SP, given, police, masks, sanitizers, Balappa Jewellers