నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

by  |
నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఎస్పీ బాలు ఆరోగ్యం పై అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై ఇన్‌‎స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. గత 48 గంటలుగా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇది శుభసూచకమన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ఎస్పీ చరణ్ పోస్ట్ చేశారు.


Next Story

Most Viewed