నగదు రూపంలో లావాదేవీలు జరపొద్దు

by vinod kumar |

దిశ, నల్గొండ: కరెన్సీ నోట్లు చేతులు మారడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, వీలైనంత వరకు నగదు రూపంలో లావాదేవీలు జరపొద్దని ఎస్పీ ఆర్ భాస్కరన్ ఓ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ చెల్లింపులు చేయాలని కోరారు. కరోనా అనేది అంటు వ్యాధి కాబట్టి, బాధితులు ఉపయోగించిన కరెన్సీ చేతులు మారినప్పుడు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Tags: SP bhaskaran, comments, people, corona, transact hand cash, nalgonda


👉 Read Disha Special stories


Next Story

Most Viewed