- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళంలోనూ తరగని ఆదరణ
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమలోకి వచ్చినా 1970-90 మధ్యకాలంలో అనేక తమిళ చిత్రాల్లోనూ పాటలు పాడి తమిళ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు ఎస్పీ బాలు. ఎంఎస్ విశ్వనాధ్ సంగీత దర్శకత్వంలో ఎల్ఆర్ ఈశ్వరితో కలిసి ‘హోటల్ రంభ’ చిత్రంలో కలిసి పాట పాడినా ఆ చిత్రం విడుదలే కాలేదు. కానీ అప్పటికే జెమినీ గణేశన్ నటించిన ‘శాంతినిలయం’ చిత్రంలో సుశీలతో కలిసి పాటలు పాడారు. ఎంజీఆర్ నటించిన ‘అడిమై పెణ్’ చిత్రంలోనూ సుశీలతో కలిసి పాడారు. కానీ జానకితో కలిసి పాడిన పాట మాత్రం మొట్టమొదట ‘కణ్ణిపెణ్’ చిత్రంలోనే. ఆ తర్వాతనే మలయాళంలో ఎస్పీకి అవకాశాలు వచ్చాయి. తొలిసారి ‘కడలప్పళమ్’ అనే చిత్రంలో దేవరాజన్ సంగీత దర్శకత్వంలో పాడారు. మాతృభాష తెలుగే అయినప్పటికీ తమిళం, మలయాళం భాషల్లోనూ స్పష్టమైన ఉచ్ఛారణతో పాటలు పాడడంతో ప్రాంతీయ, భాషలతో సంబంధం లేకుండా ఎస్పీ బాలును ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు. 1970, 80 దశకాల్లో ఇళయరాజా, జానకి, ఎస్పీ బాలు కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ అనే గుర్తింపు పొందింది.