హృతిక్ బాడీపై నేహా, సౌరవ్ డిస్కషన్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. పొలిటిషియన్స్, సినీ స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్ స్టోరీస్‌ను ఎంచుకుని.. యూనిక్ టేకింగ్, ప్రజెంటేషన్‌తో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు దర్శకులు. భాగ్ మిల్కా భాగ్, ఎమ్‌ఎస్. ధోని సినిమాలు ఇందుకు ఎగ్జాంపుల్ కాగా.. రోరింగ్ ఇండియన్, మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రజెంట్ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కిస్తారనే న్యూస్ కూడా కొన్నేళ్లుగా వినిపిస్తోంది. బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ సౌరవ్ క్యారెక్టర్ ప్లే చేస్తారని ఆల్రెడీ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది లేదు.

తాజాగా నేహా ధూపియా చాట్ షో #NoFilterNeha (నో ఫిల్టర్ నేహా)లో పాల్గొన్న సౌరవ్.. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించాడు. తనలా మరొకరిని స్క్రీన్‌పై ఇమాజిన్ చేసుకోలేనని చెప్పారు. అయితే నేహా.. హృతిక్ నేమ్ సజెస్ట్ చేయగా.. అతనికి నాలాంటి బాడీ లేదు కదా అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు సౌరవ్. చాలా మంది హృతిక్ లాంటి మస్కులర్ బాడీ కోసం ట్రై చేయాలని చెప్తుంటారని, మరి అలాంటి హృతిక్.. తన పాత్రలో నటించాలంటే, ముందుగా తనలాంటి బాడీ పొందాలంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు సౌరవ్.

Advertisement