ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘సూరారై పొట్రు’

by Jakkula Samataha |
ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘సూరారై పొట్రు’
X

దిశ, సినిమా: కోలీవుడ్ మూవీ ‘సూరారై పొట్రు’ ఆస్కార్ అవార్డ్ రేస్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఆస్కార్ అకాడమీ ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరీలో 366 చిత్రాలతో కూడిన షార్ట్ లిస్ట్‌ను ప్రకటించగా.. అందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘సూరరై పొట్రు’ కావడం విశేషం. మార్చి 5-10 వరకు అకాడమీ ఓటింగ్ జరగనుండగా.. మార్చి 15న నామినేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. మొత్తానికి ఆస్కార్ అవార్డుపై ఆశలను సజీవంగా నిలిపిన ఈ చిత్రంలో సూర్య మెయిన్ లీడ్‌గా నటించగా, సుధా కొంగర దర్శకత్వం వహించారు. కెప్టెన్ జి. గోపినాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. లాక్‌డౌన్ తర్వాత ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సూర్య, అపర్ణ బాలమురళి యాక్టింగ్ సినిమాకే హైలెట్ కాగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అలరించింది.

Advertisement
Next Story

Most Viewed