ఏపీ ప్రజలకు షాక్.. త్వరలో భారీగా విద్యుత్ బాదుడు..

by srinivas |   ( Updated:2021-12-14 00:30:54.0  )
ఏపీ ప్రజలకు షాక్.. త్వరలో భారీగా విద్యుత్ బాదుడు..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు మార్గాలు వెతుకుతోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇప్పుడు జగన్ సర్కార్ కు విద్యుత్ చార్జీలు గుర్తు వచ్చాయి. అనుకున్నదే తడవుగా మార్గదర్శాలను రూపొందిస్తోంది. దీని ప్రకారం ఏపీ ప్రజలపై 3685 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలు విధించే వివిధ స్లాబుల్లో మార్పులు చేయనుంది. 30 యూనిట్ల వరకూ విద్యుత్ ను వినియోగించిన వారికి 1.45 పైసలు అదనంగా చార్జీలు విధించనుంది.

31యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకూ వాడితే 2.80 పైసలు, 100 యూనిట్ల వరకూ వాడితే అదనంగా నాలుగు రూపాయలు భారం పడుతుంది. ఇక 101 నుంచి 200 యూనిట్ల వరకు ఐదు రూపాయలు, 201 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు వాడితే 7.50 పైసలు వసూలు చేయనుంది. అయితే పెరిగిన ధరలను ఎప్పటి నుంచి వసూలు చేస్తారు అనే విషయం ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ నెల చివరన ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Next Story

Most Viewed