- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పీఎస్4’ను హ్యాక్ చేయమంటున్న సోనీ.. ఎందుకు?
గేమర్లు, సెక్యూరిటీ ప్రోగ్రామర్లు, కోడర్ల కమ్యూనిటీలో ‘బగ్ బౌంటీ చాలెంజ్’లు కొత్తేం కాదు. తమ ఉత్పత్తుల్లో తప్పులు చూపించిన వారికి, హ్యాక్ చేసిన వారికి పెద్దమొత్తాల్లో డబ్బులను ఈ టెక్ కంపెనీలు బహుమతిగా ఇస్తాయి. ఇలాంటి బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను సోనీ సంస్థ మొదటిసారిగా అందరూ పాల్గొనేలా రూపొందించింది. ఇప్పటి వరకు సోనీ పెట్టిన ఈ తరహా పోటీలు ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేవి. సోనీ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్లే స్టేషన్ 4ను హ్యాక్ చేసి చూపించాలని చెప్పింది. విజయవంతంగా హ్యాక్ చేసిన వారికి రూ. 35 లక్షల వరకు బహుమతి ప్రకటించింది.
‘హ్యాకర్‌వన్’ అనే సంస్థతో కలిసి సంయుక్తంగా సోనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పీఎస్4 సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపకరణాలు, ప్లే స్టేషన్ నెట్‌వర్క్‌లలోని సెక్యూరిటీ సమస్యలు తెలుసుకుని, వాటిని తొలగించి వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం కోసం తాము ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సోనీ తన బ్లాగు పోస్టులో పేర్కొంది. విషమం, ఎక్కువ తీవ్రత, మధ్యస్థ తీవ్రత, తక్కువ తీవ్రతలుగా వర్గీకరించి, కనిపెట్టిన సమస్యల స్థాయి ఆధారంగా రూ. 38 లక్షలు, రూ. 7.5 లక్షలు, రూ. 2 లక్షలు, రూ. 38 వేల నగదును బహుమతిగా ఇవ్వనుంది.