రియల్ హీరోకి నెగిటివ్.. వెల్‌‌కమ్ బ్యాక్ సూపర్‌స్టార్ అంటున్న ఫ్యాన్స్

by Jakkula Samataha |
రియల్ హీరోకి నెగిటివ్.. వెల్‌‌కమ్ బ్యాక్ సూపర్‌స్టార్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్:లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులు, నిరుద్యోగులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ను కరోనా వదిలిపెట్టలేదు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా కరోనా నుంచి సోనూసూద్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. కరోనా నెగిటివ్‌గా తేలిందంటూ ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఫొటోను సోనూసూద్ పోస్ట్ చేశారు. దీంతో ‘వెల్‌కమ్ బ్యాక్ సూపర్ స్టార్’ అంటూ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు.

Advertisement

Next Story