Sonu Sood : వరంగల్‌కు సోనూసూద్ ఆక్సిజన్ సిలిండర్లు

by Shyam |   ( Updated:2021-05-28 03:09:39.0  )
Sonusood Oxygen Cylinders to Warangal
X

దిశ, పోచమ్మమైదాన్ : వరంగల్ కరిమాబాద్‌లోని సోనూసూద్ సర్వీస్ క్లబ్ (ఎస్ఎస్ఎస్‌సీ) స్వచ్ఛంద సంస్థకు సోనూసూద్ ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మరకు శుక్రవారం ఆ సంస్థ నిర్వహకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనతో బాధపడుతున్న వారికి ఎస్ఎస్ఎస్‌సీ సొంత ఖర్చులతో ఆక్సిజన్ ఏర్పాట్లు చేయడం సోనూసూద్ దృష్టికి వచ్చింది. తన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న యూత్ ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో ఆయన క్లబ్ నిర్వహకులతో మాట్లాడారు. ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే సోనూసూద్ ఫోటో ప్రింట్ వేసిన టీషర్ట్స్ పంపించాలని రియల్ హీరో కోరాడంతో నిర్వహకుల్లో ఆనందం వెల్లివిరిసింది.



Next Story

Most Viewed