నేను తెలుగింటి అల్లుడినే : సోనూసూద్

by srinivas |
నేను తెలుగింటి అల్లుడినే : సోనూసూద్
X

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు సోనూసూద్. రీల్ లైఫ్‌లో విలన్‌గా నటిస్తూ నిజజీవితంలో రియల్ హీరో అనిపించుకున్న నటుడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవలు మరపురానివి..మరువలేనివి. ఇప్పటికే ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు సోనూసూద్. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేకమందికి సహాయం చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయడం తన అదృష్టమంటున్నాడు రియల్ హీరో. ఎందుకంటే తాను తెలుగింటి అల్లుడునని చెప్పుకొస్తున్నారు. తన భార్య సోనాలి గోదావరి జిల్లా అమ్మాయని చెప్పుకొచ్చారు.

అయితే సోనాలి తల్లిదండ్రులు కొన్నిరోజులు హైదరాబాద్‌లో ఉండేవారని ఆ తర్వాత నాగ్‌పూర్‌లో సెటిల్ అయినట్లు చెప్పాడు. సోనాలిని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. తన భార్య సహకారం లేనిదే తాను ఇలాంటి సేవ చేయలేనంటున్నారు. తన భార్య చాలా దయగల మనిషి అని సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఇకపోతే సోనూసూద్, సోనాలిలు 1996లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరుకుమారులు సంతానం. పెద్దబ్బాయి ఇశాంత్‌కాగా చిన్నబ్బాయి పేరు అయాన్.

Advertisement

Next Story