- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూ సోద్ మరో సారి సాయం
దిశ, వెబ్ డెస్క్: సహాయానికి మారు పేరు సోనూసూద్. ఇటీవల ఎంతో మందికి తన సహాయాన్ని అందిస్తు రియల్ హీరో అనింపించుకుంటున్నారు. ఓ దశలో ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే ప్రభుత్వం వైపు కాకుండా సోనుసూధ్ వైపు చూస్తున్నారంటే ఆయన చేస్తున్న సేవ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక సోనూసూద్ కూడా తన సహాయం కోరి వచ్చిన వారికి కాదనుకుండా సహాయం చస్తున్నారు. దేశంలో ఏ మూలనైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఆయన దృష్టికి వచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందిస్తున్నాడు. తన సిబ్బందిని పంపించి వారికి తక్షణ సాయం అందించి వారికి ఓ కొత్త భరోసాను అందిస్తున్నాడు.
తాజాగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థికి, ఒలంపిక్స్ కు శిక్షణ పొందుతున్న ఓ క్రీడాకారునికి సోనూసూద్ అండగా నిలిచారు. మనోజ్ అనే క్రీడాకారుడు ఒలంపిక్స్ లో పాల్గోనేందుకు విపరీతంగా శ్రమిస్తునారు. కాగా తన సాధనకు కావాల్సిన రన్నింగ్ షూస్ లేకపోవడంతో ఆయన బాధ పడుతుండేవాడు. అందుకే తన స్నేహితుని షూ లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా తాజాగా ఆయన తన కుటుంబ పరిస్థితులను వివరిస్తు తనకు షూస్ కొనివ్వగలరా అంటూ సోనూసూద్ కు ట్వీట్ చేశాడు. ఇక సోనూ కూడా చాలా వేగంగా స్పందించారు. ఈ రోజు సాయంత్రం వరకు స్పోర్ట్స్ షూస్ మీ ఇంటి ముందు ఉంటాయని ట్వీట్ చేశారు.
ఇక గోవింద్ అగర్వాల్ అనే మరో యువకుడు కూడా సోనూసూద్‌ను సాయం కోరాడు. తాను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాననీ, తమది పేద కుటుంబం కావడం వల్ల పుస్తకాలను కొనుక్కోలని స్థితిలో ఉన్నానని తెలిపాడు. ఈ విషయంలో సహాయం చేస్తే తాను బాగా చదువుకోగలనని ట్వీట్ చేశారు. దీనిపై సోనూ స్పందించాడు. మీరు కోరినట్టే సహాయం చేస్తాననీ అన్నారు. రేపటిలోగా మీకు కావాల్సిన పుస్తకాలు మీ ముందు ఉంటాయని అని బదులిచ్చారు. కాగా అడిగిన వెంటనే సోనూ స్పదించడం, సహాయం అందిస్తుండటంతో ఆయన మేలు మరిచి పోలేమని వారిద్దరు అంటున్నారు.