కేంద్రానికి సోనూ రిక్వెస్ట్

by Shamantha N |   ( Updated:2020-08-25 08:11:51.0  )
కేంద్రానికి సోనూ రిక్వెస్ట్
X

ది రియల్ హీరో సోనూ సూద్ జే ఈ ఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్స్ నిర్వహణపై స్పందించారు. జే ఈ ఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6 మధ్య నిర్వహించనుం డగా.. నీట్ సెప్టెంబర్ 13న కండక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ మంచిది కాదని.. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ #PostponeJEE_NEETinCOVID హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

ఈ క్రమంలో సోనూ సూద్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ‘నీట్/జెఇఇ’ పరీక్షలను వాయిదా వేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. COVID – 19 విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి పరీక్షలు నిర్వహించకూడదని రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story