సోనూ.. నువ్వు దేవుడివి సామి

by Shamantha N |
సోనూ.. నువ్వు దేవుడివి సామి
X

దిశ, వెబ్‌డెస్క్: సోనూ సూద్ పేదల పాలిట దేవుడిలా మారుతున్నాడు. తన స్థోమతకు తగ్గట్టుగా ఆపదలో ఉన్నవారిని ఏదో విధంగా ఆదుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు వరంగా మారిన.. అతడు తన సేవ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓ పేద తండ్రి తన పిల్లాడి ఆన్ లైన్ చదువుల కోసం ఆవును అమ్మి స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. ఈ వార్త చదివిన సోనూ సూద్ అతడికి సాయం చేస్తానని ప్రకటించాడు. అతడి వివరాలు ఇస్తే ఆ ఆవును వెంటనే తిరిగి ఆ కుటుంబానికి తిరిగి ఇచ్చేద్దామని ట్వీట్ చేశాడు. దీంతో ఆ బాధిత కుటుంబం ఎక్కడ ఉందో వెతికే పనిలో పడ్డాడు. సోనూ చేస్తున్న సేవలకు నెటిజన్లు, రాజకీయ నాయకులు సైతం ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story