- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీపై సోనూ సూద్ ప్రేమ.. ఆక్సిజన్ ప్లాంట్లకు అక్కడే శ్రీకారం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో పేదప్రజలకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకొంటున్నాడు నటుడు సోనూసూద్. కష్టం అని వచ్చిన ప్రతిఒక్కరికి తనవంతు సాయం చేస్తున్నాడు. ఇప్పటికే తన సేవలు కొనసాగిస్తూ దేశ ప్రజలకు సేవ చేస్తూ పలువురి ప్రశంసలు అందుకొంటున్నాడు. ఇక తాజాగా సోనూసూద్ ఏపీ పై ఎనలేని ప్రేమను కనపరిచాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సోనూసూద్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నాడు.
ఇక తాజాగా దేశంలోని మొదటి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏపీలోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని సోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నా ఆక్సిజన్ ప్లాంట్లు ఏపీలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకటి, ఆత్మకూర్, నెల్లూరు లో మరొకటి ఏర్పాటు చేయబడుతుందని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. మొదటి సెట్ జూన్ నెలలో రానుంది. త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని” ట్వీట్ చేశారు.