- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎం బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్..!
దిశ, పటాన్‌చెరు: ఐఎస్ఎం ఎడ్యూటెక్ (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్) బ్రాండ్ అంబాసిడర్‌గా సోనుసూద్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐఎస్ఎం ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ ఫణిభూషణ్, డైరెక్టర్ డాక్టర్ సోనాల్.. సోనుసూద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ కేంద్రంగా భారతీయ విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దటానికి ఏర్పడిన ఐఎస్ఎం ఎడ్యూటెక్ చాలా ఏళ్లుగా వైద్య విద్యలో సేవలు అందిస్తోంది. కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (కగ్మా), ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (ఐఎస్ఎం) కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించిన దాదాపు ఏడు వేల మంది విద్యార్థులు నేడు భారత్‌లో సేవలు అందిస్తుండగా వేలాది మంది విద్యార్థులు విదేశాలలో సైతం డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు ఆకర్షితులైన ఐఎస్ఎం యాజమాన్యం సోనూసూద్‌తో అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. వైద్య విద్యలో అగ్రగామిగా ఉంటూ భారత్‌కు ఎంతో మంది డాక్టర్లను అందిస్తున్న ఐఎస్ఎం కుటుంబంలో తాను కూడా సభ్యుడిని కావడం ఆనందంగా ఉందని సోనూసూద్ వ్యాఖ్యానించారు.