- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమర్శలే స్ఫూర్తినిస్తాయి : సోనూసూద్
లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూసూద్. తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా.. సోనూ చేస్తున్న మంచి పనులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ నేతల విమర్శలపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. ‘నా గురించి వచ్చిన ప్రశంసలను, ఆరోపణలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎవరేం అంటున్నారో, రాస్తున్నారో పట్టించుకునేంత టైమ్ లేదు. వలస కార్మికులకు సాయం చేసే పనిలో చాలా బిజీగా గడుపుతున్నాను. ఆ మాటల గురించి స్పందించే సమయం లేదు. ఏదైనా మంచి పనిచేస్తే ఇలాంటి విమర్శలు తప్పవు. మంచి పనులు చేస్తున్నవారిని కొందరు కావాలనే వేలెత్తి చూపిస్తారు. వాటిని పట్టించుకోకుండా మనం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోవాలి. మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి విమర్శలే నాకు బలాన్ని, స్ఫూర్తినిస్తాయి’ అని సోనూసూద్ పేర్కొన్నారు.