- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ తప్పు చేయడంలో తప్పు లేదంటున్న సోనూ నిగమ్
దిశ, సినిమా : రియాలిటీ షోస్‌లో కంటెస్టెంట్లను ప్రతీసారి ప్రశంసించడం న్యాయనిర్ణేతల తప్పేనని అభిప్రాయపడ్డారు సింగర్ సోను నిగమ్. ఇండియన్ ఐడల్ 12 కాంట్రవర్సీపై స్పందించిన ఆయన.. కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్‌పై హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పారు. లేదంటే వారి తప్పులను ఎలా సరిదిద్దుకుంటారని ప్రశ్నించారు. ఎప్పుడూ పొగడటం అనేది కంటెస్టెంట్లను స్పాయిల్ చేసినట్లే అవుతుందన్న సోను.. అసలు ఎందుకు పొగుడుతున్నారనే విషయం వారికి కూడా అర్థం కానీ సిచ్యువేషన్‌కు తీసుకురావడం మంచిదికాదన్నారు.
స్టేజ్ మీద తప్పులుచేయడం కామన్ అని, ఇవే షోను ఇంట్రెస్టింగ్‌గా మలుస్తాయని అభిప్రాయపడ్డారు. కంటెస్టెంట్లలో కొందరు పుడుతూనే టాలెంట్ ఉన్నవారై ఉంటారని, కొందరు హార్డ్ వర్క్ చేసి నేర్చుకునేవారు ఉంటారన్న సోను.. వీరిలో కొందరు ఇన్‌స్టాంట్‌గా సక్సెస్ అయితే మరికొందరు తర్వాత ఫేమ్ అవుతారని చెప్పాడు. ఇండియన్ ఐడల్ 12 షోకు గెస్ట్‌గా హాజరైన సింగర్ అమిత్ కుమార్.. నిర్వాహకులు కంటెస్టెంట్లు తప్పుచేసినా పొగడాలని చెప్తున్నారని కామెంట్స్ చేయడంతో కాంట్రవర్సీ మొదలైన విషయం తెలిసిందే.