- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికొడుకుపై చేయి చేసుకున్న డిస్ట్రిక్ మెజిస్ట్రేట్.. ఫైర్ అయిన సింగర్
దిశ, సినిమా : త్రిపుర రాజధాని అగర్తలో కరోనా సమయంలో జరుగుతున్న పెళ్లిని అడ్డుకున్నాడు వెస్ట్ త్రిపుర డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్. అంతేకాదు నూతన వధూవరులు, బంధువులను ఇడియట్ అంటూ ఇష్టారీతిన తిట్టేసి, పెళ్లికొడుకు చొక్కా పట్టుకుని తనతో పాటు బంధువుల అందరిని అరెస్ట్ చేస్తానని హెచ్చరించాడు. కాగా వీడియోను వైరల్ చేసిన త్రిపుర యూత్ కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని, వెంటనే డీఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
ఈ వీడియోపై స్పందించిన సింగర్ సోను నిగమ్ డీఎంపై ఫైర్ అయ్యాడు. కొవిడ్ నిబంధనల ప్రకారం వివాహం జరగకపోతే మాత్రం ప్రజల పట్ల మరీ అంత అమర్యాదగా ప్రవర్తించాలా? అని ప్రశ్నించాడు. పెళ్లి కొడుకు, బంధువులపై కేకలు వేసిన విధానాన్ని తప్పు పట్టాడు. ప్రధాని మోడీ కూడా దేశ పౌరులతో గౌరవంగా మాట్లాడుతారని.. కానీ డీఎం మాత్రం చాలా అగౌరవంగా వ్యవహరించాడని మండిపడ్డాడు. తానేమైనా రాజు అనుకుంటున్నాడా? అని అడిగాడు సోను. వధూవరులకు స్పెషల్ మూమెంట్ అయిన పెళ్లివేడుకలో గుండాలాగా ప్రవర్తించిన డీఎం శైలేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.