ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో గురువారం అడ్మిట్ అయిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని హాస్పిటల్ చైర్‌పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. రోటీన్ టెస్టుల కోసమే సోనియా గాంధీ గురువారం హాస్పిటల్‌లో చేరినట్టు వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆమె కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలతో ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు టాప్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కడుపు నొప్పితో సోనియా గాంధీ గంగారామ్ హాస్పిటల్‌లో చేరిన విషయం విధితమే.

Advertisement