ఇప్పుడు హ్యాపీనా? : సోనమ్

దిశ, వెబ్‌డె‌స్క్:

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడమే కాదు, చాలా మంది కామెంట్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సోనమ్ తన భర్త ఆనంద్ ఆహుజా పిక్ షేర్ చేస్తూ అప్రిషియేషన్ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు వారసత్వం, స్త్ర్రీ వాదం గురించి మాట్లాడి సమాజంలో నెగెటివిటీ తీసుకొచ్చావని ఫైర్ అయింది. మీ డాడీ అనిల్ కపూర్ లేకపోతే అసలు నీకు విలువే లేదన్న ఆమె.. ఇప్పటికైనా ప్రపంచం రియలైజ్ అయి నీలాంటి నటులను పట్టించుకోవడం మానేయడం చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పింది. సోనమ్ ఒక నెపోటిజం ప్రొడక్ట్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పింది. నీ భర్త చాలా అందగాడు అనుకుంటున్నావు కానీ, చాలా చెండాలంగా ఉన్నాడని కామెంట్ చేసింది.

దీనిపై చాలా సింపుల్ అండ్ కూల్‌గా స్పందించింది సోనమ్. పాపం తను నా అటెన్షన్ క్యాచ్ చేసేందుకు ఎగ్జైట్ అవుతూ, తనకు ఫాలోవర్స్ పెరగాలని ప్రయత్నిస్తోందని.. అందుకే తన వంతు సాయం చేస్తూ స్టోరీస్‌లో షేర్ చేస్తున్నానని తెలిపింది. ‘ఇప్పటి నుంచి నిన్ను ఎక్కువ మంది ఫాలో అవుతారని అనుకుంటున్నా’ అంటూ చురకలంటించింది. ఇలాంటి నీచమైన విషయాలు తనను చాలా బాధిస్తున్నాయన్న సోనమ్.. ఇంత హేట్ తమ హృదయాల్లో పెంచుకుంటే వారే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తనను ట్యాగ్ చేసి ఇలా పోస్ట్ పెట్టేందుకు కారణం.. తనైనా హ్యాపీగా ఫీల్ అవుతుందని.. తనను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ద్వారా పది మంది దృష్టిలో పడే తన ప్రయత్నం ఫలిస్తుందనే అని తెలిపింది సోనమ్.

Advertisement