పీసీవోడీ అధిగమించేందుకు సోనమ్ టిప్స్

by  |
పీసీవోడీ అధిగమించేందుకు సోనమ్ టిప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియా‌లో యాక్టివ్ గా ఉంటుంది. స్టోరీ టైమ్ విత్ సోనమ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ ప్లాన్ చేసిన భామ.. పీసీవోఎస్/ పీసీవోడీ(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌)‌ని అధిగమించేందుకు కొన్ని చిట్కాలు చెప్పింది. పీసీవోఎస్/ పీసీవోడీ సమస్య ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుందన్న సోనమ్..ఆహారం, వ్యాయామం విషయంలో ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలని సూచించింది. సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించి సమస్యకు పరిష్కారం పొందాలని కోరింది.

14 ఏండ్ల వయసు నుంచి తను పీసీవోఎస్/ పీసీవోడీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపిన సోనమ్..ఇది నా ఉనికికి నిదర్శనం అని చెప్పింది. చాలా మంది వైద్యులు, డైటీషియన్ల వద్దకు వెళ్లాలని అని, వారి సలహాతో ప్రస్తుతం ఈ సమస్యను అధిగమించినట్లు చెప్పింది. రెగ్యులర్‌గా వ్యాయామం, యోగా చేయాలని సూచించిన సోనమ్..పీసీవోడీతో బాధపడుతున్న వారు షుగర్ అవాయిడ్ చేస్తే మంచిదని సూచించింది.

ప్రస్తుతం లండన్‌లో భర్త ఆనంద్ ఆహూజా‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న సోనమ్..తన మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పాజిటివ్ గా సమాధానం చెప్తుంది. ఈ మధ్య తండ్రి అనిల్ కపూర్ లేకపోతే అసలు సోనమ్ లేదని..జస్ట్ వారసత్వం వల్లే కెరీర్‌లో ముందుకు వెళ్లగలుగుతుందని చేసిన కామెంట్‌కు చాలా సున్నితంగా ఆన్సర్ చేసింది సోనమ్. ఆ కామెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసి ఫాలోవర్స్ కోసమే కదా..ఇదంతా ఇక నుంచి సంఖ్య పెరుగుతుంది లే అని చెప్పింది.


Next Story