తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి తల నరికి..

by Shyam |   ( Updated:2020-10-23 22:16:57.0  )
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి తల నరికి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని విచక్షణ కోల్పోయిన వ్యక్తి కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి చంద్రమ్మతో గొడపపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాముడు చంద్రమ్మ తల నరికేశాడు. అనంతరం నరికిన తలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story