బాబాయిని గొడ్డలితో నరికిన అన్నకొడుకు..

by Shyam |

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో లచ్చయ్య(55)ను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే..భూమి విషయంలో సొంత అన్నదమ్ముల కుటుంబాల మధ్య వివాదం గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే లచ్చయ్యను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికి చంపినట్టు స్థానికులు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed