తండ్రికి అతిగా ‘ఆ కోరికలు'.. తట్టుకోలేని కొడుకు మిత్రులతో కలిసి..

by Anukaran |   ( Updated:2021-10-09 00:10:37.0  )
తండ్రికి అతిగా ‘ఆ కోరికలు.. తట్టుకోలేని కొడుకు మిత్రులతో కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. కొన్ని కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నాయి. ఇంకొన్ని కుటుంబాలను కటకటాలపాలు చేస్తున్నాయి. తాజాగా ఈ వివాహేతర సంబంధం వలన కన్నకొడుకే, తండ్రిని అతి దారుణంగా చంపిన ఘటన చిత్తూరు జిలాల్లో వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం నారాయణపురం గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మృతుడు కొడుకే హత్యచేసి హెచ్ఎల్సీ కెనాల్ లో పడేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ హత్యకు తండ్రి వివాహేతర సంబంధాలే కారణమని తెలిపారు.

వివరాలలోకి వెళితే.. నారాయణపురం గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి నాగరాజు అనే ఒక కొడుకు ఉన్నాడు. నగేష్ కి మొదటినుంచి పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ విషయమై తండ్రికి, కొడుకుకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. మహిళలతో తిరుగుతూ ఆస్తిని కరిగించేస్తున్నాడని తండ్రిపై పగ పెంచుకున్నాడు నాగరాజు. అంతేకాకుండా స్నేహితులందరు తండ్రి గురించి తప్పుగా మాట్లాడంతో కోపోద్రిక్తుడైన అతను ఎలాగైనా తండ్రి నగేష్ ని మట్టుబెట్టాలని చూశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులైన మధుసూదన్, సురేష్ కు చెప్పారు. వారు కూడా హత్యకు ఒప్పుకోవడంతో మూడు రోజుల క్రితం.. బయట నుంచి వస్తున్న తండ్రిని ఇనుపరాడ్డుతో తలపై కొట్టి.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత డెడ్ బాడీని హెచ్ఎల్సీలో పడేశారు.

ఉదయం మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నగేష్ గురించి, అతడి కొడుకుతో గొడవలు గురించి ఆరా తీసిన పోలీసులు నాగరాజు ప్రవర్తన అనుమానించతగ్గ రీతిలో ఉండడంతో అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పరాయి మహిళలతో తిరుగుతూ ఆస్తిని మొత్తం ఆవిరిచేస్తున్నాడనే కోపంతో, తన స్నేహితులతో కలిసి తానే తన తండ్రిని హత్యచేసినట్లు నాగరాజు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.

Advertisement

Next Story