కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర: సోమువీర్రాజు

by srinivas |
కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర: సోమువీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆలయాలపై దాడులను నిరసిస్తూ కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 4 నుంచి ఎనిమిది రోజుల పాటు బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో యాత్ర కొనసాగిస్తామని, దేవాలయాలకు నష్టం జరిగిన ప్రాంతాలను కలుపుతూ పాదయాత్ర ఉంటుందన్నారు. పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలు జన జాగృతి హిందుత్వానికి జరుగుతోన్న విఘాతంపై పోరాడుతామన్నారు. డీజీపీ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే మరో ఉద్యమం చేపడుతామని తెలిపారు. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed