- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘జనసేన-బీజేపీ ఉమ్మడి పోరాటం’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలను కలుపుకు పోతున్నారు. శుక్రవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ శాలువ కప్పి సోము వీర్రాజును సత్కరించారు.
కాగా, ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యచరణపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా బీజేపీ-జనసేన పోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం అడుగులు వేస్తామని ప్రకటించారు. కాగా, అంతకు ముందు సోము వీర్రాజు చిరంజీవిని కూడా కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story