- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంతకం సరే.. వేలిముద్ర ఎలా ఫోర్జరీ అయింది సారూ..?
దిశ, వికారాబాద్ : సంతకం సరే.. ఆ అధికారి వేలిముద్ర ఎలా ఫోర్జరీ జరిగిందంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దార్ రవీందర్ వేలిముద్రను ఫోర్జరీ చేసి అక్రమంగా భూ బదలాయింపు చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తహశీల్దార్ కార్యాలయంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిధిలోని బుర్గుపల్లిలో సర్వే నెంబర్ 18లో గల 7:12 ఎకరాల భూమిని తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి యజమానికి తెలియకుండా మరొకరి పేరుమీద భూ బదలాయింపు చేశారు ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్లు, మరికొంత మంది.
సంతకాన్ని ఫోర్జరీ చేస్తారు కానీ, వేలిముద్రను ఎలా ఫోర్జరీ చేస్తారు అనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. ఎమ్మార్వోకు తెలియకుండానే ఈ తతంగమంతా జరిగిందా..? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా తహశీల్దార్ ప్రమేయం లేకుండానే వేలిముద్ర ఫోర్జరీ ఎలా సాధ్యమవుతుందినే ప్రశ్నకు కొందరు రెవిన్యూ, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మరి దీనికి సదరు ఎమ్మార్వో ఏమి సమాధానమిస్తారో వేచిచూడాలి.