- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మిర్జాపూర్’ మాటల తూటాలు..‘సింబా’ అరుపుల్లో
దిశ, వెబ్ డెస్క్: 2019లో వచ్చిన ‘ద లయన్ కింగ్ ’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇటీవలే ‘మిర్జాపూర్ -2’ ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే, లయన్ కింగ్, మిర్జాపూర్ ఈ రెండింటికీ ఏంటీ కనెక్షన్? వీటి ప్రస్తావన ఎందుకిప్పుడు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చిన్నారులతో పాటు పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం ‘ద లయన్ కింగ్’. ఈ సినిమా సేమ్ మన రివేంజ్ తెలుగు సినిమాను తలపిస్తుంది. లయన్ కింగ్ సినిమా..మనకు జీవిత సత్యాల్ని నేర్పిస్తుంది. మిర్జాపూర్ సిరీస్..హార్ట్ హిట్టింగ్‘క్రైమ్’కథ. మరి సాఫ్ట్ సింబాకు ? డేంజరస్ ‘గుడ్డు’కు కనెక్షన్ ఎలా వచ్చిందంటే.. అదంతా ట్విట్టర్ యూజర్ ‘ప్రితిమ్‌హత్రే’(@PritiMhatre6) సృజనాత్మకత అని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ‘మిర్జాపూర్-2’ ట్రైలర్‌లోని డైలాగ్‌లను ‘లయన్ కింగ్’ సినిమాలోని కొన్ని సీన్లకు సింక్ చేసి అద్భుతం చేసింది. ఆ డైలాగ్స్ పర్‌ఫెక్ట్‌గా సింక్ కావడంతో నెట్టింట్లో ఆమె రూపొందించిన వీడియో వైరల్‌గా మారింది.
https://twitter.com/PritiMhatre6/status/1298269380443172866?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1298269380443172866|twgr^&ref_url=https://www.storypick.com/mirzapur-lion-king-crossover/
ఇదిలా ఉంటే.. ‘మీర్జాపూర్’ సిరీస్‌లోని పదునైన సంభాషణలను.. ‘అవెంజర్’ క్యారెక్టర్స్‌తో పోలుస్తూ.. మీమ్స్ క్రియేట్ చేసి.. మరో లెవల్‌కు క్రియేటివిటీని తీసుకెళ్లారు.
Series Of Events Ft_Avengers × Mirzapur pic.twitter.com/EbSy3JU0qv
— Meme_Raja (@thekhanwasif) August 19, 2020
అమెజాన్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ తొలి సీజన్ ఘన విజయం సాధించడంతో రెండు సీజన్లపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు వెయిట్ చేయగా, రెండేండ్ల తర్వాత రెండో సీజన్ విడుదల తేదీని అమెజాన్ ఈమధ్యనే అనౌన్స్ చేసింది. దాంతో సస్పెన్స్‌కు తెరపడింది. ఆక్టోబర్ 23న ఈ సిరీస్‌లోని రెండో సీజన్ అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది.