- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BLOCKED : ట్విట్టర్ ఖాతాలు ప్రజెంట్ వర్కింగ్!
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి పలువురి ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అవ్వగా, సుమారు 6గంటల తర్వాత తిరిగి వాడుకలోకి వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత వ్యక్తులు ఇతర సామాజిక మాద్యమాల ద్వారా వెల్లడించారు. అయితే, కేంద్రానికి వ్యతిరేకంగా, సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తు్న్న ఆందోళనలను సపోర్టు మరియు షేర్ చేస్తున్న ట్విట్టర్ ఖాతాలు మాత్రమే నిలిపివేయబడ్డాయని కొందరు ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వాన్ని హరించడమే అని బాధితులు వాపోతున్నారు. ఈ దేశంలో వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడకూడదా అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ సరిహద్దుల వెంబడి ఆందోళనలను ఉధృతం చేస్తున్న రైతులను నిలువరించలేక కేంద్ర ప్రభుత్వం నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలను కంట్రోల్ చేస్తోందని’ చురకలు అంటించారు. సోమవారం నిలిపివేయబడిన ఖాతాల్లో న్యూస్ ఏజెన్సీకి చెందిన కారవాన్ మ్యాగజైన్, కిసాన్ ఎక్తా మోర్చా, సినీ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ (లేట్), ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఆమ్ఆద్మీ పార్టీతో పాటు సీపీఐ(ఎం)కు చెందిన రాజకీయ నాయకుల ఖాతాలు కూడా ఉన్నాయి.
ఇదిలాఉండగా, సొసైటీలో అరాచకం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ సాధారణ పౌరులను రెచ్చగొడుతున్న వ్యక్తుల అకౌంట్లను నిలిపివేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ను కోరినట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే సుమారు 200లకు పైగా అకౌంట్లు ఈరోజు బ్లాక్ అయినట్లు సమాచారం.