- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేం కూడబెడితే మీరెలా ఖర్చు చేస్తరు..?
దిశ, జుక్కల్ : భవన నిర్మాణ కార్మికులకు వారి సంక్షేమ బోర్డ్ ద్వారా నెలకు రూ. 5 వేల చొప్పున సంవత్సరం పాటు అందించాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)తరపున సురేష్ గొండ డిమాండ్ చేశారు. సోమవారం బిచ్కుందలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ విలేకరులతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల నుండి వసూలు చేసిన సంక్షేమ నిధులు కేంద్రంలో నలభై వేల కోట్లరూపాయలు, రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయల నిధులు పొగుబడి ఉన్నాయన్నారు. వాటితో ప్రస్తుత కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిధులను వేరే సంక్షేమ పథకాలకు మళ్లించడం సరైంది కాదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ బోర్డు నుండి 30 వేలకోట్లు రూపాయలు ను దారి మళ్లించి వివిధ రంగాలకు ఖర్చు చేయగా, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఇతర రంగాలకు ఖర్చు చేసిందన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న భవన నిర్మాణ కార్మికులను మాత్రం దిక్కు లేనివారిగా కరోనా సమయంలో అదుకోవాల్సిన పరిస్థితికి తెచ్చిందన్నారు. భవన నిర్మాణంలో పనిచేస్తున్న ప్రతివారు కూడు, గూడు లేని నిరుపేదలని ఆయన వివరించారు.