దాశరథికి స్వగ్రామంలో ఘన నివాళులు

by Shyam |
దాశరథికి స్వగ్రామంలో ఘన నివాళులు
X

దిశ, చిన్నగూడూరు : దాశరథి కృష్ణమాచార్యులు జీవితం యువతకు ఆదర్శప్రాయమని ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్ రెడ్డి అని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దాశరథి విగ్రహం ప్రాంగణంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు 34వ వర్ధంతి వేడుకలో భాగంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. నాటి నిజాం రాక్షస పాలనను తన గేయాలతో, పద్యాలతో, కవిత్వంతో నిరసించిన గొప్ప యోధుడు దాశరథి అని కొనియాడారు. ఎట్టి చాకిరి నిర్మూలనకు, గ్రామాల్లో ఉన్న పెత్తందార్ల, హింసలకు ఎదురోడ్డి నిలిచి తన కలాన్ని ఆయుధంగా మలిచి పోరాడారు అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంసింగ్, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్, ఎంపీడీవో సరస్వతి, ఆర్ఐ మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మురళీ, ఉప సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మన్నె చెన్నయ్య, యాదగిరి, బీసు మల్లేశం, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story