- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ అప్పులతో పిట్టల్లా రాలుతున్న బాధితులు
దిశ, వెబ్ డెస్క్ : మీకు డబ్బులు కావాలా అంటూ హస్కీ వాయిస్ తో ఎరవేయడంతో సామాన్యులు మోసపోతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం. అప్పిచ్చే నాథుడే లేకపోవడంతో ఇన్ స్టంట్ లోన్ యాప్స్ తో మధ్యతరగతి మానవుడికి లక్కీ లాటరీ తగిలినట్లు అనిపిస్తోంది. అలా అన్ లైన్ లోన్లకు అలవాటు పడి వరుసగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
నిన్న సిద్దిపేట కు చెందిన యువతి ఓ ఇన్‌స్టంట్ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించడంతో ఆలస్యం కావడంతో.., సదరు యాప్ నిర్వహాకులు డబ్బులు కట్టాలంటూ బాధితురాల్ని వేధింపులకు గురిచేశారు. దీంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
తాజాగా రాజేందర్ నగర్ కిస్మాత్ పూర్ కు చెందిన సునీల్ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో ఇన్ స్టంట్ లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నాడు. కొన్నిరోజులు టైమ్ టూ టైమ్ కట్టినా.., ఆ తరువాత ఎర్నింగ్స్ లేకపోవడంతో లోన్ కట్టడం ఆలస్యం అయ్యింది. ఇన్ స్టంట్ లోన్ యాప్ నిర్వహాకులు సునీల్ ను వేధింపులకు గురిచేశారు.
ఆ వేధింపులతో అప్పు చెల్లించేందుకు ఒక యాప్‌లో లోన్ తీసుకొని మరో యాప్‌లో లోన్ క్లియర్ చేయడం..ఇలా పదియాప్ లలో బాధితుడు ఇన్‌స్టంట్ లోన్ తీసుకున్నాడు. చివరికి లోన్ తీసుకున్న యాప్ లకు డబ్బులు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఏజెంట్‌లు సైతం సునీల్ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు కట్టాలంటూ ఆమెను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన సునీల్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల కారణంగా తన భర్త సునీల్ ఆత్మహత్య చేసుకున్నారంటూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసునకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.