- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుదోవలో డిజిటల్ మీడియా.. జోరుగా అసత్యాల ప్రచారం
దిశ, పటాన్‌చెరు: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న.. హిందూ వ్యతిరేక ప్రచార వార్తలను సమర్ధవంతంగా ధీటుగా ఎదుర్కోవాలని డిజిటల్ హిందూ సమ్మేళనం కార్య నిర్వాహకులు కప్పర ప్రసాద రావు, పెద్దాపురం నర్సింహులు తెలిపారు. సోమవారం బానూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. హిందుత్వంపై విదేశాలు వేదికగా తప్పుడు ప్రచారాలు సాగిస్తున్న డిజిటల్ మీడియాపై ఈ నెల 11వ తేదీన ఉదయం 9.30 గంటలకు సంగారెడ్డి నియోజకవర్గం కంది లక్ష్మీ నరసింహా హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా డిజిటల్ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు తో పాటు.. పలువురు హిందూ వాద నాయకులు, స్వామీజీలు, ఢిల్లీ కి చెందిన బీజేపీ నేతలు హాజరు అవుతారని పెర్కోన్నారు.. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను తెలియక ఫార్వర్డ్ చేసే వారు కూడా చట్టపరమైన కేసులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. వీరందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అనుభవజ్ఞులైన పలువురు ప్రముఖులు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇందులో ప్రజలు, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.