- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రైక్.. గొప్పలు డప్పు కొట్టినా ఫలితం లేదంటూ..
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో అత్యధిక మెంబర్‌షిప్ కలిగిన రీజియనల్ పార్టీ అయిన టీఆర్ఎస్‌కు మూల స్థంబంగా భావించే సోషల్ మీడియా సైనికులు షాక్ ఇచ్చారు. ఏ ఎన్నిక వచ్చినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంలో సోషల్ మీడియా సైనికులు ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా చేసే పోస్టులను అడ్డుకొని తమదైన శైలిలో తిప్పికొడుతుండటం తెలిసిందే. అయితే, ఇంతలా పనిచేసే సైనికులు పార్టీ వైఖరిని ఖండిస్తూ స్ట్రైక్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత గొప్పగా ప్రచారం చేసినా మాపై పట్టింపే లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా సైన్యం ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ చేశారు. ‘‘ టీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఇక సెలవు.. టీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్దలు సోషల్ మీడియా వారియర్స్ పట్ల నిర్లక్ష్య వైఖరి మారే వరకు మా నిర్ణయంలో మార్పు ఉండదు..’’ అని వారి బాధను చెప్పుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.