సబ్బుల ధరలు తగ్గించేందుకు సంస్థల నిర్ణయం

by Shamantha N |   ( Updated:2020-03-21 06:20:15.0  )
సబ్బుల ధరలు తగ్గించేందుకు సంస్థల నిర్ణయం
X

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ప్రజలకు అత్యవసరంగా మారిన సబ్బులు, శానిటైజర్ల ధరలను తగ్గించేందుకు పలు ప్రముఖ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎంసీజీ హిందూస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ కరోనా వైరస్‌ను నివారణకు రూ. 100 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. లైఫ్ బాయ్ శానిటైజర్లు, లిక్విడ్ హ్యాండ్ వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లినర్ల ధరను 15 శాతం తగ్గిస్తున్నాట్లు ఆ సంస్థ వెల్లడించింది. వస్తువుల ఉత్పత్తిని కూడా తక్షణమే ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఇవి త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. అంతేకాకుండా అవసరమైన ప్రాంతాల్లో రెండు కోట్ల లైఫ్ బాయ్ సబ్సులను ఉచితంగా పంచుతామని తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలతో కలిసి పనిచేస్తున్నామని సంస్థ సీఎండీ సంజీవ్‌ మెహతా వివరించారు. హెచ్‌యూఎల్‌ బాటలోనే పతంజలి, గోద్రేజ్‌ సంస్థలు సైతం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అలోవెరా, హల్దీ-చందన్‌ సబ్బుల ధరను 12.5 శాతం తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌.కె.తిజరావ్లా తెలిపారు. అటు ముడిసరకు ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై పడనివ్వబోమని గోద్రేజ్‌ ప్రకటించింది. సబ్బుల తయారీకి అవసరమయ్యే ముడిసరకు ధరలు గత కొన్ని నెలల్లో 30శాతం పెరిగాయని.. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సీఈఓ సునీల్‌ కటారియా తెలిపారు.

tag:Soap, making, companies, decide, low prices, lifebuoy, patanjali, godrej

Advertisement

Next Story

Most Viewed