- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బయోడైవర్సిటీ ఫార్మింగ్ తో ఎన్నెన్ని లాభాలో..!
దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణానికి మేలు చేసే మల్టీ డైమెన్షనల్ సిస్టంను డెవల్ప్ చేసుకోవాలి. మన చుట్టూ పచ్చని చెట్లు, మెడిసినల్ ప్లాంట్స్, పెంపుడు జంతువులు, కోళ్లు, కుందేళ్లు వీటితోపాటు పక్షులు, తేనెటీగలు, కీటకాలు, వివిధ రకాల జంతువులు, సూక్ష్మజీవులకు ఆలంబనగా నిలిచే ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఊహించండి.. అవును అలా ఉంటే ఈ కరోనా వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు. అలా చేయడం ఆసాధ్యమేమీ కాదంటున్నారు పర్యవరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన వాతావరణం, మంచి ఫుడ్ తీసుకోవాలి. కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తుండడంతో ఇమ్యునిటీ పవర్ పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. భవిష్యత్ కాలంలో కరోనా కంటే దారుణమైన వైరస్‌లు రావొచ్చని మేథావులు హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.. ఇందుకోసం బయోడైవర్సిటీ ఫార్మింగ్ ఎంతో ఉపయోగకరం. దీనిద్వారా సహజ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుకోవచ్చు. తినే ఫుడ్‌లో రసాయనాలు కలువకుండా ఉండపోవడం.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
పర్యావరణాన్ని కాపాడొచ్చు..
బయోడైవర్సిటీ ఫార్మింగ్‌లో ఓవైపు ఆరోగ్యానికి కావాల్సిన పండ్లు, కూరగాయలు పండించుకుంటూనే, మరోవైపు పర్యావరణాన్ని కాపాడొచ్చు. జీవవైవిధ్య వ్యవసాయంలో ఓవైపు మొక్కలను పెంచుతూనే, మరోవైపు పశుపాక్ష్యాదులను సాకడం ప్రధానం. ఒక్కసారి మొక్కలన్నీ చెట్లుగా మారిన తర్వాత కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ బయోఫార్మింగ్‌లో అడవి, మూలిక, ఆహారం, పూలు ఇలా అన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ప్రత్యేకంగా బయటి నుంచి కొనాల్సిన అవసరం లేదు. అలాగే పెంపుడు జంతువులు, కోళ్లు, కుందేళ్లు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పాటిస్తున్న ఒకే రకమైన పంటలు పండించే విధానానికి ఇది పూర్తిగా విభిన్నం.
5 ఎకరాలుంటే చాలు
దాదాపు ఐదెకరాల భూమిలో బయోడైవర్సిటీ సాగు ప్రారంభించొచ్చు. ఫార్మింగ్ చేయడం వల్ల తాము ఉపాధి పొందుతూ.. ఇతరులకు కూడా ఉపాధి కల్పించొచ్చు. దీని ద్వారా నగరాలకు వలసలు తగ్గుతాయి.. ఊరిలోనే మంచి ఆదాయం సంపాదించొచ్చు. ఇటీవల పెళ్లి అయిన వారు, లేదా త్వరలో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకునే వాళ్లు ఇప్పటి నుంచే భూమి సొంతం చేసుకునే ప్రయత్నం చేసి, అందులో సంప్రదాయ, స్థానిక, వివిధ రకాల మొక్కలు పెంచడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించిన వారవుతారు.
ఫాంలోనే హోం..
బయోడైవర్సిటీ పార్కులోనే ఇల్లు కట్టుకుని అన్ని వసతులను కల్పించుకోగలిగితే కరోనా లాంటి మహమ్మారి ఏదైనా వస్తే ఇక్కడ పండించిన ఆహారంతో ఎంతకాలమైనా ఉండొచ్చు. దీంతో ఇతరుల మీద ఆధారపడే అవసరం కూడా ఉండదు. సంక్షోభ పరిస్థితుల్లో ఈ బయోఫార్మింగ్ ఎంతో లాభాలను అందిస్తుంది. సంపాదించుకున్న ఆస్తులు సంక్షోభ సమయాల్లో ఏ రకంగానూ ఉపయోగపడవు, అప్పుడు ఉపయోగపడేది ప్రకృతి మాత్రమే అనేది దృష్టిలో ఉంచుకుని ఈ బయోఫార్మింగ్ చేపట్టాలి. ఈ బయోడైవర్సిటీ ఫార్మింగ్ వల్ల సీనియర్ సిటిజన్లు, ఒంటరిగా ఉండే వాళ్లకు భవిష్యత్తులో చాలా ఉపయోగం.
సంప్రదాయ మొక్కలు..
సహజమైన కూరలు ఫార్మింగ్ చేద్దామనుకునే వారికి అనేక సందేహాలు తలెత్తుతాయి. వాటిలో మొదట వచ్చే సందేహం ఏ మొక్కలు పెంచాలని ఆలోచిస్తుంటారు.. ఇందుకోసం ముందుగా సంప్రదాయ చెట్లైన మామిడి, పనస, జామ, సపోటా, దానిమ్మ, జీడీ, ఉసిరి, సీతాఫలం మొక్కలు పెంచాలి. అంతేకాకుండా పైనాపిల్, బొప్పాయి, ద్రాక్ష, నేరేడు మొక్కలు కూడా పెట్టొచ్చు. అలాగే అసంప్రదాయ మొక్కలైన ఎర్రచందనం, ఈగిస, టేకు, నెమలినార, తాడి, జీలుగు, వేప, అశోక, చింత, తుమ్మ, రేల వంటి చెట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇక అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటు ఆహారం కోసం గోధుమలు, వరి వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక జంతువుల పెంపకం విషయానికొస్తే ఓ పది కోళ్లు, నాలుగు గొర్రెలు, ఒక బర్రెతో మొదలు పెట్టి వాటికి కాపలాగా ఒక కుక్కను కూడా పెంచుకోవచ్చు. వీటన్నింటికీ నీటి సదుపాయం కోసం ఒక బోరుతో పాటు, కొన్ని వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌తో నీటి పొదుపు వాడకం సరిపోతుంది. ఇంకా కావాలంటే సౌర శక్తిని వినియోగించుకోవచ్చు.
Tags: bio diversity, farming, environment, animals, plants, vegetables