జులై 4న విడుదలవుతున్న ‘స్నాప్‌చాట్ స్పెక్టాకల్స్’

by Harish |
జులై 4న విడుదలవుతున్న ‘స్నాప్‌చాట్ స్పెక్టాకల్స్’
X

దిశ, వెబ్‌డెస్క్: స్నాప్‌చాట్ ఇదివరకే విదేశాల్లో విడుదల చేసిన స్మార్ట్ లెన్స్ స్పెక్టాకల్స్‌ను ఇండియాలో జులై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు స్నాప్‌చాట్ స్పెక్టాకల్స్ వెబ్ సైట్‌లోనూ ఈ గ్లాసెస్ లభ్యం కానున్నాయి. స్నాప్‌చాట్ ‘స్పెక్టాకల్స్ 2, స్పెక్టాకల్స్ 3’గా వీటిని పిలుస్తుండగా.. ఈ రెండింటిలో ప్రధానమైన తేడా కెమెరానే. స్పెక్టాకల్స్ 2 మామూలు కెమెరా కాగా, స్పెక్టాకల్స్ 3లో 3-డీ కెమెరా కలిగి ఉంది. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 70 వరకు వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.

‘స్పెక్టాకల్స్ 2’ ఫీచర్స్

బరువు – 45.4 గ్రాములు
ఫ్లాష్ స్టోరేజ్ – 4జీబీ
స్టోర్ – అప్‌టూ 150 వీడియోలు / 3 వేల ఫోటోలు
రెండు కెమెరాలు – (1642 x 1642 పిక్సల్స్ రిజల్యూషన్ )
డ్యుయల్ మైక్రోఫోన్, లిథియం ఐయాన్ బ్యాటరీ, బ్లూటూత్ 4.0, వైఫై
ధర – రూ. 14,999/-

‘స్పెక్టాకల్స్ 3’ ఫీచర్స్

బరువు – 56.5 గ్రాములు
స్టోరేజ్ – 4జీబీ ( 100 3-డీ వీడియోలు / 1200 3-డీ ఫోటోలు )
రెండు కెమెరాలు – (1728 x 1728 రిజల్యూషన్)
లిథియం ఐయాన్ బ్యాటరీ, బ్లూటూత్ 4.0, వైఫై
ధర – రూ. 29,999/-

Advertisement

Next Story