పదివేల పాములను పట్టి.. ఇలా చనిపోయాడు

by Shamantha N |
పదివేల పాములను పట్టి.. ఇలా చనిపోయాడు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో విషసర్పాలను అవలీలగా పట్టిన చైన్నైకి చెందిన స్టాన్లీ ఫెర్నాండజ్(62) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లో దూరిన పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడంలో అటవీ, అగ్నిమాపకశాఖల అధికారులకు సహకరించేవారు. 25 ఏళ్ల లో సుమారు 10వేల పాములు పట్టాడు. అయితే ఆయనకు ఐదు రోజులక్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అత్యవసర చికిత్స నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ స్టాన్లీ తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్లు దాటినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పాములు పట్టుకోవడం కొనసాగిస్తూ ఇది కూడా ఒకరకం సమాజసేవ అనేవారు. ఇన్ని ఏళ్లగా స్టాన్లీనీ ఏపాము ఏం చేయలేదు కానీ కరోనా మాత్రం కాటేసింది. ఆయనకు భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed