- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మార్కెట్ లో పాలకూర కొన్న జంట.. తీరా ఇంటికెళ్లి చూస్తే షాక్
దిశ, వెబ్ డెస్క్: కూరగాయలు కొందామని ఒక జంట మార్కెట్ కి వెళ్ళింది. అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి కదా అని చూసుకోకుండా కొనేశారు. బిల్ కట్టి ఇంటికి వెళ్లారు. కూరగాయలను సర్దడానికి రెడీ అయిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము తెచ్చిన పాల కూర కవర్ లో పామును చూసి హడలిపోయారు. ఈ వింత ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది.
అలెక్స్ వైట్ అనే వ్యక్తి తన భార్య అమేలియా నీట్ తో కలిసి సూపర్ మార్కెట్ లో ఆకుకూరలు , సరుకులు కొనుగోలుచేసాడు. ఇంటికి వచ్చి ఆకుకూరలను సర్దుతుంటే పాలకూర కవర్ లో 7.8 అంగుళాల పాము బైటకొచ్చింది. దాన్ని చూసిన వారి గుండెలు ఒక్కసారి ఫాస్టుగా కొట్టుకున్నాయి. మళ్లీ అందులోను అది విషపూరితమైన పాము కావడంతో భార్యాభర్తలిద్దరూ స్టన్ అయ్యారు. వెంటనే అలెక్స్ ఆ పామును వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. పాలకూర కొనేటప్పుడే కవర్ బరువుగా ఉందని, లోపల ఇంకేదైనా ఉందా అని తనలో తానే మాట్లాడుకున్నానని, కానీ ఇలా విష సర్పం ఉంటుందని ఊహించలేదని తెలిపాడు.
పాలకూరలో పాము ఉన్న విషయాన్ని అలెక్స్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వెంటనే వచ్చి ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కవర్ లో నుండి అది కనిపించింది కాబట్టి సరిపోయింది .. లేకపోతే కవర్ ఓపెన్ చేసి ఉంటే అంతే సంగతులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.