కోహ్లీ లేడు స్మిత్‌.. నీకిదే మంచి అవకాశం

by Shyam |
కోహ్లీ లేడు స్మిత్‌.. నీకిదే మంచి అవకాశం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు అనంతరం ఇండియాకు తిరిగి రానున్న సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టు తర్వాత కోహ్లీ లీవ్ తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఆ లీవ్.. స్మిత్‌కు మంచి అవకాశంగా మారనున్నది. టెస్టుల్లో కోహ్లీ 26సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్థానంలో స్టీవ్ స్మిత్(25) ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో వీరిద్దరే అగ్రస్థానంలో ఉన్నారు.

కాగా, తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ చేయలేకపోతే 26 సెంచరీల మీదే ఉంటాడు. కానీ స్మిత్ మాత్రం మొత్తం నాలుగు టెస్టుల్లో రెండు సెంచరీలు చేస్తే కోహ్లీని దాటేస్తాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో రోహిత్ శర్మ లేకపోవడం కోహ్లీకి కలిసిరానుంది. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లీ, రోహిత్ శర్మలు చెరి ఐదు శతకాలు బాదారు. కోహ్లీ మరో సెంచరీ చేస్తే రోహిత్‌ను వెనక్కు నెడతాడు. మరోవైపు ఈ పర్యటనలో కోహ్లీ రెండు సెంచరీలు చేస్తే.. అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. తొలి స్థానంలో సచిన్ (100) ఉండగా, రెండో స్థానంలో రికీ పాంటింగ్ (71), మూడో స్థానంలో కోహ్లీ (70) ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed