- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా స్మార్ట్ టెక్నాలజీ పరికరాల వినియోగం ఇటీవల భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే దేశీయంగా స్మార్ట్ స్పీకర్ల రవాణా ఈ ఏడాది ముగిసే సమయానికి 7.5 లక్షల యూనిట్లు దాటే అవకాశాలున్నాయని టెక్ఆర్క్ సోమవారం విడుదల చేసిన తన నివేదికలో తెలిపింది. 2020, సెప్టెంబర్ త్రైమాసికంలో 91 శాతం వాటాతో అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ ఈ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడు పోయింది. దీని తర్వాతి స్థానంలో జియోమీ 7 శాతం, గూగుల్ 2 శాతం వాటాను దక్కించుకున్నాయి.
స్మార్ట్ టెక్నాలజీ కోసం దేశీయంగా డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగానే వాయిస్-కంట్రోల్‌డ్ స్మార్ట్ స్పీకర్ వంటి పరికరాల విక్రయాలు పెరిగాయని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే త్రైమాసికంలో స్మార్ట్ స్పీకర్ల ఎగుమతులు గత త్రైమాసికంతో పోలిస్తే 87 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని ఫైసల్ పేర్కొన్నారు.